సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం నిధికి పెన్నాడ కి చెందిన సోము స్వరూప్ కుమార్ వారి కుమార్తె, గీత సహస్ర పేరుమీద 100,116 ఒక లక్ష నూట పదహారు రూపాయలు అందజేశారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, శేషవస్త్రం చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్త పాపొలు ఏడుకొండలు ప్రసాదం ఫోటో అందజేశారు. అలాగే ఇటీవల స్థానిక భక్తురాలు… భీమనాధం భాస్కర్ రావు గారి జ్ఞాపకార్థం వారి భార్య శ్రీమతి జయలక్ష్మి నాలుగు గ్రాముల బంగారం కానుకగా సమర్పించారు.. వారికీ ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం మరియు ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్,అతికెల్ ఆంజనేయ ప్రసాద్ ప్రసాదం ఫోటో అందించారు.
