సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినీపరిశ్రమలో కామిడి సినిమాల హీరోగా మంచి డిమాండ్ ఉన్న ‘భీమవరం’ బ్రాండ్ శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా , మలయాళ బ్యూటీ మహిమ నంబియార్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’ (Comrade Kalyan). జానకిరామ్ మారెళ్లదర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమా కు సంబంధించి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ ‘ఒరియా పిల్లా మంచి ఆదరణ దక్కించుకున్నాయి,ఈ నేపథ్యంలో నిర్మాతలు తాజాగా ఈ సినిమా నుంచి ఇంత ఇష్టమా? అంటూ సాగే ప్రేమ పాటను విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ పాటను భాస్కరబట్ల చక్కటి సాహిత్యం అందించారు. ఇప్పుడు ఈ పాట విడుదల అయిన కొద్ది సమయంలోనే యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసి మిలియన్ వ్యూస్ తో అదరగొడుతుంది.
