సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:నేడు, సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొత్తగా పీపీపీ పద్దతిలో ఏర్పాటు చేయబోతున్న రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల అంశం ప్రస్తావనకు వచ్చింది.ప్రజల సోకార్యం కోసం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంటే… కొందరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. . రిజిస్ట్రేషన్ సేవలను మరింత సులభతరం చేసేలా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం-RSKలను ఏర్పాటు చేస్తున్నామని… ఇది ప్రైవేటీకరణ ఎంత మాత్రమూ కాదని ప్రకటించారు.
