సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం గోపి చాంద్ దర్శకత్వంలో సినిమా షూటింగ్లో ఫైట్ సన్నివేశంలో క్రింద పడి కాలి మోచిప్ప కు గాయపడిన హీరో , టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే బాలకృష్ణకు సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు.నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. వారి అచంచలమైన సంకల్పబలం దృష్ట్యా, వారు అతి త్వరలోనే తిరిగి పనిలో నిమగ్నమవుతారని నాకు నమ్మకం ఉంది! త్వరగా కోలుకోండి!’ అని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
