సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: భీమవరం త్యాగరాజ భవనంలో వాసవి క్లబ్ భీమవరం ఆధ్వర్యంలో నేడు, ఆదివారం వాసవి సరస్వతి పథకం కింద 300 మంది ఇంటర్ విద్యార్థులకు స్టడీ మెరిటియల్స్ ను స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. విద్య అనేది ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువగా విషయాలు తెలుసుకోవచ్చునని ..గత 25 ఏళ్లుగా ప్రతి ఏడాది ఇంటర్ మొదట సంవత్సరం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఉచితంగా ఇంటర్ పాఠ్య పుస్తకాలను అందించడం గొప్ప విశేషమని, క్లబ్ సభ్యులను అభినందించారు. క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మునగ వెంకట చిన్నయ్య, బంగారు రజనీకాంత్, కోశాధికారి వీవీఎస్ గుప్తా మాట్లాడుతూ.. 2000 సంవత్సరంలో వాసవి సరస్వతి పథకాన్ని ప్రారంభించామని, 25 ఏళ్లుగా ప్రతి ఏడాది 200 నుంచి 300 మంది ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందిస్తున్నామని, ఈ ఏడాది 120 మంది ఇంటర్ మొదటి సంవత్సరం, 180 మంది ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పుస్తకాలను అందించామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *