సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో వాడవాడలా ప్రతివార్డులో శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు, ఆదివారం స్థానిక మెంటే వారి తోటలో స్థానిక యువత నిర్వహిస్తున్న శ్రీ అమ్మవారి జాతరకు మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరు అయ్యి శ్రీ అమ్మవారికి ప్రత్యక పూజలు నిర్వహించిన తదుపరి హంస వాహనంపై శ్రీ అమ్మవారి పుర ఊరేగింపు ను ప్రారంభించారు. జాతర నిర్వాహకులను అభినందించి శ్రీ అమ్మవారి దయ అందరిపై ఉండాలని కోరుకున్నారు. శక్తి వేషాలు బాణాసంచా కాల్పులతో శ్రీ అమ్మవారి జాతర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోట బోగయ్యతో పాటు స్థానిక పెద్దలు యువత పాల్గొన్నారు.
