సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 29 వ తేది బుధవారం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శ్రీ అమ్మవారికి పండ్లు, కాయగూరలుతో అద్భుతమైన శాకంభరి అలంకరణ వైభవంగా నిర్వహించనున్నామని అలాగే సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని, లోకక్షేమం, ప్రజల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి అని అదేరోజు ఉదయం 7 గంటలకు చండీ హోమం కూడా జరుగుతుంది అని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, ధర్మకర్తల మండలి వారు తెలిపారు భక్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారి దివ్య దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించాలని దేవస్థానం కార్యనిర్వాహణాధికారి కోరారు.
