సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ సిలెండర్లు వినియోగదారులను ఈ-కేవైసీ నిబంధన వెంటాడుతుంది. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం ఈ నెల 16 లోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని చమురు మార్కెటింగ్ సంస్థలు నిబంధన విధించడంతో వినియోగదారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలో నిలబడితే తిప్పలు తప్పించేందుకు డెలివరీ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకి ఈ-కేవైసీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన నెట్ స్పీడ్ సరిపడక పోవడం వంటి సమస్యలు వారిని వెంటాడుతున్నాయి.
