సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నేడు, సోమవారం 54 మంది లబ్ధిదారులకు ఎల్.ఓ.సి మరియు ముఖ్యమంత్రి సహాయనిధి రూ 42,67,793 చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ, టీడీపీ ఇంచార్జి, తోట సీతారామలక్ష్మి , టిడిపి రాష్ట్ర నేత, మెంటే పార్ధసారధి మాట్లాడుతూ.. వైద్య చికిత్సలు, అత్యవసర శస్త్ర చికిత్సలకోసం పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్‌వోసీ మంజూరి పత్రాలు అందజేస్తూ ఆపత్కాలంలో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఏపీ కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ భీమవరం టిడిపి ఇన్చార్జి తోట సీతారామలక్ష్మి ద్వారా సుమారు మూడున్నర కోట్ల రూపాయల సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మేరగాని నారాయణమ్మ టిడిపి రాష్ట్ర మాజీ కార్యదర్శి వెండ్ర శ్రీనివాస్ జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు మామిడిశెట్టి ప్రసాద్ రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్ ,మాజీ కౌన్సిలర్లు ఎద్దు ఏసుపాదం మైలబత్తుల ఐజాక్ బాబు చల్లబోయిన సుబ్బారావు యాళ్ళ వెంకటేశ్వరరావు తదితర నేతలు పాల్గొన్నారు.
