సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం టీడీపీ కార్యాలయంలో నేడు, గురువారం ఇరువురి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి రూ 7 లక్షల 63 వేల ఎల్ ఓ సి పత్రాలను రాజ్యసభ మాజీ సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అందించారు. తదుపరి ఆమె మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం పెద్ద ఉపశమనంగా నిలిచిందన్నారు. వీరవాసరం మండలం నేలపోగుల గ్రామానికి చెందిన చింతపల్లి లీల కుమారికి నెలలు నిండకుండా పుట్టిన బేబీకి ట్రీట్మెంట్ నిమిత్తం రూ 5,04,895, భీమవరం మండలం ఎల్ విఎన్ పురంకు గ్రామానికి చెందిన మల్లాడి రాధకుమారి ఊపిరితిత్తుల వ్యాధి చికిత్స నిమిత్తం 2,58,062 ల చొప్పున మొత్తం రూ 7 లక్షల 63 వేల విలువైన చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం మండల టిడిపి అధ్యక్షుడు కొయ్యలగడ్డ గణపతి మరియు రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
