సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత దశాబ్దంగా సరైన హిట్ లేక సతమతమై ఇటీవల వీరభద్రుడు’ లాంటి ఘన విజయం తర్వాత సూర్య హీరోగా నటించిన సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ‘లక్కీ భాస్కర్’ తర్వాత వెంకీ అట్లూరి చేసిన సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మరి ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ధనవంతుడు.. ఒలంపిక్స్‌లో షూటింగ్‌లో గోల్డ్ మెడల్ కూడా తెస్తాడు. నాలుగు పదుల వయసు దాటినా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోతాడు. తండ్రి తన మొదటి భార్య నిర్మల (రాధికా శరత్ కుమార్) అయిన కన్నతల్లిని వదిలేసి.. సినిమా హీరోయిన్ అయిన అంజలి దేవి (రవీనా టాండన్)ను వివాహం చేసుకోవడంతో అతనికి బంధాల మీద విరక్తి ఏర్పడుతుంది. అయితే తల్లి కోరిక మేరకు సరోగసి పద్ధతిలో ఒక మగ బిడ్డను కంటాడు. పుట్టిన బాబుకు బోన్‌కు సంబంధించిన సమస్య రావడంతో ఆ బిడ్డను డబ్బు కోసం కడుపులో మోసిన మ్యాడీ (మమిత బైజు) సహాయం అవసరమవుతుంది. ఆ క్రమంలో సంజయ్‌ను ఆమె ఇష్టపడుతుంది. 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న సంజయ్‌తో మ్యాడీ పెళ్లైందా లేదా ? వెండి తెరపై చూడాలి. ఇక విశ్లేషణకు వస్తే..కోటీశ్వరుల ఇళ్లలో అయినా, పేదవారి ఇళ్లలో అయినా మానవ సంబంధాలు, ఒకేలా ఉంటాయని దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాతో చక్కగా చెప్పే ప్రయత్నం చేశాడు.ఎక్కడ తడబడకుండా అద్భుతంగ తీసాడు కూడా.. చిన్నపాటి పట్టింపులను పక్కనపెట్టి కూర్చుని మాట్లాడుకుంటే ఎలాంటి కుటుంబ సమస్య అయినా పరిష్కారం అవుతుందనే సందేశం బాగుంది. హీరో సూర్య ఇతర నటీనటులు అందరు సమర్దులే కాబ్బటి అందరు చక్కగా వారి పాత్రలలో ఇమిడిపోయారు.సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం కథలోని భావోద్వేగాలను మరింత ఎలివేట్ చేశాయి. సినిమాటోగ్రఫర్ నిమిష్ రవి ప్రతి ఫ్రేమ్‌ను చాలా కలర్ ఫుల్‌గా రిచ్ గా చూపించాడు నవ్వులు , కష్టాలు కలగలసిన మంచి పీల్ ఉన్న మంచి చిత్రం..
