సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్;: నేడు, సోమవారం ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలతో మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌ రాజు సభా కార్యకలాపాలను మొదలుపెట్టారు. సభ మొదలైన వెంటనే డీఎస్సీ అక్రమాలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. అవినీతి ఫై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో.. పోడియం వద్ద ఆ పార్టీ సభ్యులు నిరసనకు దిగారు. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి నాదెండ్ల మనోహర్ , ఎమ్మెల్సీ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దల సభలో ఇలా చేయటం సరికాదన్నారు. ఏపీ శాసనమండలిలో డీఎస్సీపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం నడిచింది. విద్య శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయవలసిందే నని బొత్స సత్యనారాయణ మరియు వైసీపీ ఎమ్మెల్సీ లు పట్టు బట్టారు… ఈ దశలో వైసీపీ సభ్యులపై మంత్రి అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. డీఎస్సీపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. ఐదేళ్లు కనీసం డీఎస్సీ ఇవ్వలేదని, అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స.తమ అధినేత జగనకు ఈ విషయం చెప్పలేక పోయారన్నారు. తాము వచ్చాక డీఎస్సీ వేస్తే వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. తమ హయాంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షకే మరల మెగా డీఎస్సీ అని కలరింగ్ ఇచ్చి పాత పోస్టులు మరోసరి మెగా డీఎస్సీ లో కలిపి అక్రమాలకు తెరలేపారని వైసీపీ సభ్యులు విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *