సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు, మంగళవారం క్యాబినెట్ మంత్రుల సమావేశం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా నేపథ్యంలో అసెంబ్లీలోని సీఎం చాంబర్లో సభ విరామం సమయంలో మంత్రులు సమావేశం అవుతున్నారు. ఈ భేటీలో సెప్టెంబర్ నుండి స్థానిక సంస్థల ఎన్నిక పక్రియలో మునిసిపల్ ఎన్నికల ప్రారంభిస్తున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు అమలే ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీపై ముందుకు వెళ్లే అంశంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. ఈసారి మేయర్ల ప్రత్యక్ష ఎన్నికలకు చట్ట సవరణ ప్రతిపాదనలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఈసమావేశంలో దాదాపు 55కు పైగా అజెండా అంశాలతో మంత్రులు సమావేశం కానున్నారు.
