సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. నేడు, బుధవారము శాసనమండలిలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ ‘తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభలో తిరుగులేని అధికత్య లో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ సభ్యుల బలం ఉండటంతో కూటమి అభ్యర్థులు ఎవరు నామినేషన్ వేయకపోవడంతో మాధవరావు ఎన్నికను ఏకగ్రీవము అయినట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. అనంతరం మాధవరావును చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. మాధవరావును అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టేందుకు అన్ని పార్టీల సభ్యులు కలిసి రావాలని మండలి చైర్మన్ కోరారు. అయితే కూటమి సభ్యులు ఎవరు రాకపోవడం తో విపక్ష వైసీపీ నేత బొత్య సత్యనారాయణ ఇది సభా సంప్రదాయం కాదని రాజ్యాంగ పదవి ని పార్టీలకు అతీతంగా గౌరవించాలని అన్నారు.
