సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం అసెంబ్లీ, సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ లాబీలో మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. ప్రతి పక్ష వైసీపీ వాళ్ళు ‘దేవాలయం’ లాంటి అసెంబ్లీని బహిష్కరించటం దేశ చరిత్రలోనే లేదని పేర్కొన్నారు. సభలోకి రాకుండా బయట కూర్చుని వైసీపీ సభ్యులు ఎంత మాట్లాడినా విలువ ఉండదని ఎద్దేవా చేసారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ అనేది అత్యున్నత స్థానమని అలాంటి వేదికను ఓ పార్టీ అధినేత తో పాటు మొత్తం సభ్యులు బహిష్కరించటం తన రాజకీయ జీవితంలో ఇలాంటిది చూడలేదని తెలిపారు .1989 నుంచి1994 సమయంలో ఎన్టీఆర్ మధ్యలో అసెంబ్లీకి రాకపోయినా తామంతా పార్టీ తరఫున అసెంబ్లీకి వెళ్లి ప్రజల తరఫున పోరాడామని చెప్పారు. 2019 నుంచి 2024 మధ్య తాను సవాల్ చేసి బయటకొచ్చినా తమ టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు వరకూ పోరాటం వదల్లేదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని చులకన చేసే గొడ్డలిపార్టీ నాయకుడికి ఈ రాజకీయాలు అవసరమా? అని ప్రశ్నించారు
