సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో పురాణ ప్రాశస్యం కలిగిన ‘పంచారామ క్షేత్రం’ శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం నందు శ్రీ అన్నపూర్ణ అమ్మవారికి శ్రీ పార్వతి అమ్మవారికి ప్రతి సంవత్సరం శ్రీ వరలక్ష్మీ వ్రతం రోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా విశేషంగా దర్శించుకొనే భక్తులు శ్రావణ పట్టీ ( స్వీట్లు) కానుకగా సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో రేపు ది 21 -8 -2026 వ తేదీ పవిత్ర శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ సంవత్సరం శ్రీ అన్నపూర్ణ అమ్మవారికి శ్రీ పార్వతి అమ్మవారికి ఇప్పటికే భక్తులు 27 కేజీలు స్వీట్లు సమర్పించి ఉన్నారని ఆలయ అర్చకులు మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగార్రాజు మరియు సభ్యులు, కార్యనిర్వాహణాధికారి డి రామకృష్ణంరాజు తెలిపారు.
