సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం ఉదయం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు – పశివేదల వద్ద రైలు మార్గంలో ఫెర్టిలైజర్స్ లోడుతో ఒడిశా నుంచి మహారాష్ట్రకు వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో విశాఖపట్నం, విజయవాడ మధ్య పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే రైల్వే శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని రైళ్ల రాకపోకలను పునరుద్దరించే పనులు చెప్పట్టారు. నేటి సాయంత్రానికి పూర్తీ అయ్యి అవకాశం ఉంది. అయితే ఈ మార్గంలో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.. సామర్లకోటలో విశాఖపట్నం నుంచి వస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నిలిపివేశారు. అలాగే హౌరా నుంచి తిరుపతి వెళ్లే ఎక్స్‌ప్రెస్ , కాకినాడ ఎక్స్ ప్రెస్ , రత్నాచల్ రైలును కూడా సామర్లకోటలో నిలిపి ఉంచారు. దీనితో విశాఖ, విజయవాడ ప్రధాన రైల్వే మార్గంలో రైళ్లు దాదాపు 8 గంటల ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో వైపు వరుస సెలవులు.. రెండో శనివారం, ఆదివారం, సోమవారం వినాయకచవితి వచ్చాయి.దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లు అన్ని ప్రయాణికులతో కిక్కిరిసి పోవడం గమనార్హం.
