సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు, శుక్రవారం ఉదయం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన నియోజకవర్గ టిడిపి కమిటీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నందున ఎంపీటీసీ ,ఎంపీపీ, మున్సిపల్ కౌన్సిలర్, చైర్మన్ అభ్యర్థుల ఆశవాహలను గుర్తించే విధంగా క్షేత్రస్థాయికి వెళ్లాలని కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని టిడిపి నాయకులకు దిశా నిర్దేశం చేశారు. టిడిపి రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్లు కో-కన్వీనర్లు గ్రామ వార్డు కమిటీల నాయకులు బిజెపి, జనసేన పార్టీల కూటమి నాయకులను సమన్వయం చేసుకుని కూటమి అభ్యర్థుల విజయానికి విశేష కృషి చేయాలన్నారు. టీడీపీ కమిటీల నాయకులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులతో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
