సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి 11 కిలో మీటర్లు దూరంలో సుమారు 450 ఏళ్ల క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా భువుడుగా వెలసిన కాళ్ళకూరు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో నేటి శుక్రవారం ఉదయం శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు శ్రీ స్వామి వారిని ఇఓ M,అరుణ్ కుమార్, ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానంలో వైభవంగా జరుగుతున్న “సప్తనది జలాభిషేక పూర్వక పవిత్రోత్సవం మరియు మహా పూర్ణాహుతి” కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా రఘురామా.. శ్రీ స్వామివారి కృపాకటాక్షాలు అందరిపై ఎల్లవేళలా ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.
