సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించింది. సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ పల్లె పండుగ 3.0 పనులను ప్రారంభించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం రామాపురము లో పల్లె పండుగ కింద రూ.11,085 కోట్లతో చేపట్టనున్న గ్రామీణాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్, మాధవ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు. తమ మెడలో వేసుకున్న కూటమి పార్టీల జెండాలను గాల్లో ఊపుతూ ఘనంగా స్వాగతించారు. కాగా, పల్లె పండుగ కార్యక్రమం సందర్భంగా గత ప్రభుత్వంలో రోడ్లు, గ్రామాల దుస్థితిని గుర్తు చేస్తూ, కూటమి ప్రభుత్వం వచ్చాక చేసిన అభివృద్ధిని వివరిస్తూ అధికారులు ప్రజలకు వీడియోలు చూపించారు. గత నెల రోజులుగా కేరళలో తన అనారోగ్యానికి ‘పకృతి వైద్యం’ చేయించుకున్న పవన్ కళ్యాణ్ హైద్రాబాదు లో ఇటీవల తన నివాసానికి తిరిగి వచ్ఛోక ఏపీలో పాల్గొన్న తోలి అధికారిక ప్రభుత్వ కార్యక్రమం కావడం తో ఆయన అభిమానులలో అక్కడ జోష్ కనిపించింది.
