సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మునిసిపల్ కమిషనర్ రానున్న మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు లిస్టులు విడుదల చేసిన నేపథ్యంలో ప్రజలలో ఉన్న సందేహాలు నివృత్తి కి ఇచ్చిన ప్రకటన ప్రకారం.. ఏపీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ నెం. .865/SEC-F2/2026, Dt.17-10-2026 ప్రకారం, భీమవరం పురపాలక సంఘమునకు సంబంధించి విలీనము కాబడిన గ్రామ పంచాయతీలయిన 1) రాయలం, 2) చిన-అమిరం, 3) కొవ్వాడ -అన్నవరం మరియు 4) తాడేరు లతో కలిపి మొత్తం 52 వార్డులకు ఫోటో ఎలెక్టోరల్ ఓటర్ల జాబితాను ది.01.01.2026 క్వాలిఫైడ్ డేట్ గా వార్డుల వారీగా ఓటర్ లిస్టులను తయారు చేయవలసినదిగా ఇచ్చిన ఆదేశాల మేరకు సదరు ఓటర్ల జాబితా 1 నుండి 52 వార్డులకు ప్రచురించి భీమవరం రెవెన్యూ డివిజినల్, తహశీల్దార్, కార్యాలయాలు. మరియు స్థానిక వార్డు సచివాలయ కార్యాలయాలులో ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలియపరిచారు. నిజానికి ‘గ్రేటర్ భీమవరం’ నగరం ప్రతిపాదన విలీన గ్రామాలు వ్యతిరేకించాయి.వారు కోర్ట్ కు వెళ్లడం వల్లే గత 8 ఏళ్లుగా మునిసిపల్ ఎన్నికలు జరగలేదు.. మరి ఈసారి కూడా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *