సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం కేంద్రం ప్రవేశపెడుతున్న 3 బిల్లులు సభ్యుల ఆమోదం పొందితే ( రాజ్యసభలోనే కాస్త కష్టం.. అయినా..) మహిళలకు ఇకపై 233 లోక్ సభ సీట్లు కేటాయింపు తో పాటు దేశ డీలిమిటేషన్తో దేశవ్యాప్తంగా లోక్ సభ స్థానాలు 815కు పెరుగుతాయని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. దేశం మొత్తానికి ఒకే పద్ధతిలో 50 శాతం చొప్పున సీట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో లోక్ సభ స్థానాల సంఖ్య వచ్చే ఎన్నికలకు 25 నుండి 38కి చేరనుంది. ఈ నేపథ్యంలో లోక్ సభ తో పాటు అసెంబ్లీ కి కూడా అదనంగా కొత్త నియోజకవర్గాలు వస్తాయి. (బహుశా జనాభా లెక్కల ప్రకారం నియోజక వర్గాలను విభజిస్తే ..) సుమారు ఏపీలో 175 కు బదులుగా ఇకపై 225 స్థానాలు పైగా నియోజక వర్గాలు వచ్చే అవకాశం ఉంది. ఆ స్థానాలు ఎక్కడెక్కడ ఏర్పాటవుతాయనే ఆసక్తి నెలకొంది. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం ఉన్న 2 లోక్ సభ స్థానాలు కచ్చితంగా 3 కు, అలాగే అసెంబ్లీ స్థానాలు 15నుండి 20 కి పైగా పెరుగుతాయి. రాష్ట్రంలో అధికారం నిర్ణయించే నియోజకవర్గంగా చరిత్ర సాక్ష్యం చెబుతున్న భీమవరం ఈసారి 2 నియోజకవర్గాలుగా విడిపోయే అవకాశం స్వష్టంగా ఉంది. జిల్లాలో సుమారు 2న్నర లక్షల ఓటర్లు చప్పున అతిపెద్ద నియోజవర్గాలయిన భీమవరం, ఉండీ నియోజకవర్గాల పరిధి కలపి వచ్చే ఎన్నికలకు 3-4 స్థానాలుగా మారె అవకాశం ఉంది. కొత్త అభ్యర్థులకు ప్రోత్సహకంగా ఈసారి రాజకీయ కోలాహలం మరింత పెరిగి. ప్రజలను విభజిస్తుందా? వారికీ ఏమి మేలు చేస్తుందో? భవిషత్తు నిర్ణయిస్తుంది. ఏది ఏమైనా చట్టం అమలు లోకి వచ్చిన తరువాత సర్వే పూర్తీ అయ్యాక ‘ఎన్నికల కమిషన్’ ఆయా నియోజకవర్గాలను అధికారికంగా ప్రకటించవలసిందే తప్ప.. అప్పటివరకు ..ఏ మీడియా చెప్పిన అంచనా నిజం అవుతుందో వేచి చూడాలి… సిగ్మా ప్రసాద్ కాలమ్స్
