సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం రోజు శని దేవుని జయంతి పర్వదినం నేపథ్యంలో భీమవరం గునుపూడిలోని పవిత్ర పంచారామ క్షేత్రం లోని శ్రీ సోమేశ్వరునితో పాటు నవగ్రహాల ఉప ఆలయం వేలాది భక్తులతో పోట్టెత్తిపోయింది శని భగవానుడికి క్యూ లైన్ లో నిలబడి భక్తులు తైలాభిషేకాలు చేసారు. ( ఫై చిత్రంలో ) నేటి తెల్లవారు జాము నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తుల రద్దీ తగ్గలేదు. ‘శని’ దేవునికి హోమాలు శాంతి పూజలు, విప్రులకు దానాలతో ఆ దేవాలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. దేవాలయ ధర్మకర్తలు, ఇఓ డి రామకృష్ణంరాజు భక్తులకు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *