సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల మృతి చెందిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం , పీసీసీ మాజీ అధ్యక్షుడు కొవ్వూరు మాజీ ఎమెల్య జీఎన్ రావుల సంస్మరణ సభను రాజమండ్రిలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకు అతీతంగా కాపు నేతలు హాజరయ్యారు. ముద్రగడ పద్మనాభం, జీఎన్ రావులకు నివాళులు అర్పించిన నేతలు.. వారి ఆశయాలను సాధించాలన్నారు. సంస్కారవంతుడైన ‘ముద్రగడ’ కాపుల కోసం పోరాటానికి తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి.. వందల ఎకరాల పొలం, తన స్వంత ఆస్తులు అమ్ముకున్న అమరజీవి అని.. ఆయన చేసిన పోరాటాలను వాటి వల్ల ప్రస్తుత కాపు జాతికి లభించిన గౌరవాలు వక్తలు స్మరించుకొన్నారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ విషయంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని, అవసరమైతే మరోసారి పోరాటాలకు సిద్ధంగా ఉండాలని గళం వినిపించారు. ముద్రగడ ఉద్యమంతోనే కాపు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు వస్తున్నాయని, నిరుద్యగ కాపులకు ప్రభుత్వ రుణాలు మంజూరు అవుతున్నాయని మరోసారి గుర్తు చేశారు. గోదావరి జిల్లాల్లో ముద్రగడ పద్మనాభం కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలంటూ కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే జోతుల నెహు,ఎమ్మెల్సీ సోము వీర్రాజు కాపు జేఏసీ నాయకుడు దాసరి రాము వైసీపీ నేతలు, సజ్జల రామకృష్ణా రెడ్డితో పాటు కాపు నేతలు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కురసాల కన్నబాబు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్ తదితరులు హాజరయ్యారు
