సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని పేదరికంలో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా . తల్లికి వందనం పథకం డబ్బులను లబ్దిదారుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన జారీ చేసింది. దీంతో రేపు బుధవారం లక్షలాది మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లలో రూ.13 వేలు జమ కానున్నాయి. ఈ పథకం కింద ప్రభుత్వం రూ.15 వేలు అందిస్తుండగా.. స్కూళ్ల నిర్వహణ కోసం రూ.2 వేలు ప్రభుత్వం తీసుకుంటుంది. మిగతా రూ.13 వేలను విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తింపచేయనుండగా.. వారి తరపున తల్లుల ఖాతాల్లో నగదు జమ కానుంది. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న నిధుల విడుదల ప్రక్రియ.. 24వ తేదీ వరకు వేస్తారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *