సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చట్టసభల్లో మహిళల రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపునకు సంబంధించి కేంద్రం నేడు, గురువారం మూడు కీలక బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టింది.. రాజ్యసభలో ప్రవేశ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, నేడు, గురువారం ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారత దిశగా దేశం చరిత్రాత్మక ముందడుగు వేయబోతోందని అన్నారు. భారత దేశ మహిళలపై గౌరవంతో ఈ దిశగా సాగుతున్నామని అన్నారు. తల్లులకు, సోదరీమణులకు ఇచ్చే గౌరవమే దేశానికి మనం ఇచ్చే గౌరవమని వ్యాఖ్యానించారు. ఈ బిల్లులకు చట్టరూపం ఇచ్చేందుకు పార్లమెంటు నేటి నుంచీ మూడు రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశం కానుంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి గరిష్ఠంగా 850కు పెంచేలా ప్రభుత్వం ఈ బిల్లులను ప్రవేశపెడుతోంది. సీట్ల తుది సంఖ్యను మాత్రం డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయించనుంది. ఈ బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభిస్తే 2029 నుంచీ దేశ వ్యాప్తంగామరిన్ని అదనపు నియోజకవర్గాలు పెరగటం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *