సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తమ మధ్య ఉన్న శత్రుత్వం మరచి సుమారు 10 ఏళ్ళ తరువాత చైనా పర్యటనకు వచ్చిన ట్రంప్ ను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచింది చైనా.. అతనికి స్వాగతం, వీడ్కోలు కూడా స్థానిక చైనా స్కూల్ పిల్లలతో చెప్పించి చేతులు దులుపుకొంది. అసలే భారీ గౌరవాలు గొప్పలు ఎక్కువ కోరుకొనే ట్రంప్ కాస్త అసహనంగానే పోజులు ఇస్తూ.. ఎదో రకంగా తట్టుకొని చైనా బంధం తో ఎదో సాదించేసానని చెప్పి ఇరాన్ వద్ద అణుబాంబు ఉండకూడదని అలాగే యుద్ధంలో చైనా తలదూర్చకుండా కోరుకొంటూ వెళ్లిపోయారు. అయితే అమెరికా, చైనాల మధ్య అపనమ్మకం ఏ స్థాయిలో ఉందో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా పర్యటనలో మరోసారి వెలుగులోకి వచ్చింది. చైనా పర్యటన అనంతరం అమెరికా అధికారులు చైనా వారు ఇచ్చిన వస్తువలన్నీ అక్కడి చెత్తబుట్టల్లోనే పడేసి వెనుదిరిగినట్టు తెలుస్తుంది. . ట్రంప్ వెంట వచ్చిన అధికారులు, విలేకరులు తిరిగి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ఎక్కే సమయంలో చైనా వస్తువులు, బహుమతులు, ఐడీ కార్డులు వంటివాటిని అక్కడి చెత్తబుట్టల్లో పడేశాకే విమానం ఎక్కారు. అని యూఎస్ జర్నలిస్టుల్లో ఒకరు బహిర్గతం చేసారు.‘చైనా వారు ఇచ్చిన ఏ ఫోన్‌ను ఎయిర్‌ఫోర్స్ వన్‌లోకి అనుమతించలేదు’ అని సదరు జర్నలిస్టు పేర్కొన్నారు.
