సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకలు భీమవరం ఉండి నియోజక వర్గాలలో ఘనంగా జరుగుతున్నా నేపథ్యంలో పెదమిరం లోని రఘురామా కృష్ణంరాజు నివాసానికి వెళ్లి భీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున గవర్నింగ్ బాడీ సభ్యులు వారిని కలిసి నేడు, శుక్రవారం ఉదయం శుభాభినందనలు తెలియజేశారు. మన డెల్టా ప్రాంత అభివృద్ధి కి రఘురామా చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్త , కార్యదర్శులు కాగిత వెంకటరమణారావు ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి శివ ,R. V. ప్రసాద్ రావు, సుంకర చినబాబు పాల్గొన్నారు.
