సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పచ్చని గోదావరి జిల్లాలను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసి అన్నదాతలకు శాశ్వత సంపదను అందించిన మహనీయులు సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాలకు భీమవరం లో పలువురు నివాళ్లు అర్పించారు. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ, భీమవరం నియోజవర్గ టిడిపి ఇన్చార్జ్ తోట సీతారామలక్ష్మి , మెంటే పార్ధ సారధి ఆధ్వర్యంలో నిర్వహించిన కాటన్ జయంతి కార్యక్రమంలో తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ..విదేశీయుడు అయ్యినప్పటికీ కాటన్ దొర ముందు చూపుతో గోదావరిడెల్టా కు జీవం పోసి లక్షలాది రైతు కుటుంబాలకు వెలుగునిచ్చారని వారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం మనందరి అదృష్టం మన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలతో పాటు . డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కునాదిరాజు మురళీకృష్ణంరాజు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *