సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పంజాబ్‌లో రెండు గంటల్లో, 2చోట్ల వరుస బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. అయితే ఈ . జలంధర్ పేలుడు వెనుక తమ హస్తముందని వేర్పాటువాడు సంస్థ ఖలిస్థానీ లిబరేషన్ ఆర్మీ నేడు. బుధవారం ప్రకటించింది. ఫిబ్రవరిలో గురుదాస్‌పూర్ జిల్లాలో పంజాబ్ పోలీసుల చేతిలో హతమైన ఉగ్రవాది రంజిత్ సింగ్ మృతికి ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్టు ప్రకటించింది. గత మంగళవారం రాత్రి అమృత్‌సర్ కంటోన్మెంట్ ప్రాంతం సమీపంలోనూ, జలంధర్‌లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ప్రధాన కార్యాలయం దగ్గర ఈ రెండు పేలుళ్లు జరిగాయి.రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు (Punjab twin blasts).మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో జలంధర్‌లోని బీఎస్‌ఎఫ్ కార్యాలయం బయట పార్క్ చేసిన ఉన్న ఓ స్కూటర్ పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. అయితే సమీపంలో ఉన్న కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *