సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:మ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పామాయిల్ పంట పండిస్తున్న రైతులు హర్షం ప్రకటిస్తున్నారు. ఎందుకంటే పామా యిల్‌ ధర టన్ను కు రూ.23,656 పెరిగింది. పామా యిల్‌ చరిత్రలోనే ఇది అత్యధికం. గత ఫిబ్రవరి నెలలో రూ.21,546లుగా ఉన్న ధర మార్చిలో రూ.1390 పెరిగి రూ.22,936 అయ్యింది. తాజగా ఈ మే నెలలో ప్రకటించిన కొత్త ధర టన్నుకు రూ.720 పెరిగి, రూ.23,656 అయ్యింది. గడచిన 6నెలల్లో పామాయిల్‌ ధర పెరుగుతూవస్తుంది. . గతంలో పామాయిల్‌ గెలల ధర ఆశాజనకంగా లేకపోవడం, సాగులో నష్టాలను చవి చూసిన కొంతమంది రైతులు పెదవేగి,చింతల పూడి జంగారెడ్డి గూడెం వంటి పలు ప్రాంతాలలో చాలామటుకు తోటలను తొలగించేశారు. ప్రస్తుతం ఉన్న రైతుల పంతమాత్రం లాభాలతో పండుతుంది. . రాష్ట్ర ప్ర భుత్వం ఉద్యానశాఖద్వారా ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రోత్సాహకాలు, పలు రాయితీలు అందిస్తుండడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *