సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపు 7వ తేదీ న తమిళనాడు నూతన సీఎంగా ప్రమాణం స్వీకారం చేయనున్న విజయ్ 50 ఏళ్లుగా 2 ప్రధాన పార్టీల మధ్య అధికారం పంపిణి జరిగిన తమిళ రాజకీయాన్ని కొత్త బాటలు పట్టిస్తున్నారు. 234 సీట్లున్న అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ (118) కు కొద్ది దూరంలో టీవీకే పార్టీ 108 దగ్గరే నిలిచిన తరుణంలో..,ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన 5 గురు ఎమ్మెల్యేలను పీఎంకే తన 4గురు ఎమ్మెల్యేలను లెఫ్ట్ పార్టీలు 4 గురు ఎమ్మెల్యే ల మద్దతు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో తాజాగా నేడు, బుధవారం రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి.. కొత్తగా ఎన్నికైన మెజారిటీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పాడి కే పళనిస్వామి (EPS) ని ఈ దిశగా ఆలోచించాలని డిమాండ్ చేసారు.. ఎన్డీయే కూటమిలోని అన్నాడీఎంకే తరుపున గెలిచిన 47 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది టీవీకేకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ రోజు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశాన్ని పళనిస్వామి అర్థంతరంగా రద్దు చేసుకున్నారు. విజయ్ కూడా తన ప్రమాణ స్వీకారానికి ఏపీ మాజీ సీఎం జగన్ ను స్వయంగా ఫోన్ లో ఆహ్వానించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *