సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల రైలు ప్రయాణ అవసరాలను తీర్చడమే ధ్యేయంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రత్యేక శ్రద్ధతో చేసిన కృషి ఫలితంగా నరసాపురం నుండి భీమవరం మీదుగా అరుణాచలం (తిరువణ్ణామలై), బెంగళూరులకు నడుస్తున్న స్పెషల్ రైళ్లను ఇకపై రెగ్యులర్ గా చేస్తూ (Regularise) రైల్వే శాఖ నుండి ఉత్తర్వులు జారీ చేయించారు. గత నెలలో నరసాపురం పార్లమెంట్ అనుసంధానంగా ప్రయాణించే 9 స్పెషల్ రైళ్లను క్రమబద్ధీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో, ఈ రెండు కీలకమైన రైళ్లను కూడా పర్మనెంట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుగా మారుస్తూ రైల్వే ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ రైళ్లు రెగ్యులర్ కావడం వల్ల ప్రయాణికులకు స్పెషల్ సర్వీసులతో పోలిస్తే, ఇకపై ఈ రైళ్లలో ప్రయాణ ఛార్జీలు 30 శాతం వరకు తగ్గనున్నాయి, అంతేకాకుండా, ప్రయాణికుల భద్రత మరియు అత్యంత సౌకర్యం కోసం ఈ రైళ్లను అత్యాధునిక రేక్స్ (Modern Rakes) మరియు అప్‌గ్రేడ్ చేసిన 24 కోచ్‌లతో (AC, స్లీపర్, జనరల్) నడపడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *