సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ లో నేడు ఆదివారం ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని నిర్వహించారు. 5 నుండి 80 సార్లు వరకు ఎక్కువ సార్లు రక్తదానం చేసిన రక్త దాతలను గుర్తించి వారిని సత్కరించారు.( సురేంద్ర 80 సార్లు, కృష్ణ భగవాన్ 78 సార్లు, ఎస్ రవి ప్రసాద్ 76 సార్లు, డి రామకృష్ణంరాజు 53 సార్లు, ఎం వెంకట్రారావు 53 సార్లు, రాజేష్ 51 సార్లు..) టిడీపి మాజీ ఎంపీ సీతారామలక్ష్మి మాట్లాడుతూ.. ఒక్క చుక్క మానవత్వంతో రక్త దానం చేస్తే ప్రాణాలను కాపాడిన వారు అవుతారని, దేశంలో ప్రతీ రెండు సెకన్లకు ఒకరికి రక్తం అవసరం అవుతుందని సుమారు 70 శాతం మంది రక్తం దొరక్క మరణిస్తున్నారన్నారు. 18 నుంచి 60 ఏళ్ల లోపు ఎవరైనా రక్తదానం చేయడానికి అర్హులేనని, ఒక వ్యక్తి తన జీవితకాలంలో సుమారు 168 సార్లు రక్తదానం చేయొచ్చునని అన్నారు. అత్యధిక సార్లు 80 సార్లు, 70 , 60 , 50 సార్లు పైబడి రక్తదానం చేసిన దాతలను అభినందించి సత్కరించారు. ఇక్కడ రక్తదాత దినోత్సవ వేడుకలను జూన్ 14వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు నిర్వహిస్తామని రక్తదాతలకు ఆరోగ్య రక్ష హెల్త్ చెకప్ కూపన్స్ ఇవ్వడం ద్వారా వారికి వారి కుటుంబ సభ్యులకు ఉపయోగించుకోవడం ద్వారా మేలు జరుగుతుందన్నారు
