సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శ్రావణ శుక్రవారం శ్రీమహా విష్ణువు ధర్మపత్ని లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనది. శ్రావణమాసంలో చేసే నోములు, వ్రతాలు, పూజల వల్ల లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. నేడు, శ్రావణ శుక్రవారం కావడంతో భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో శ్రీ మావుళ్ళమ్మవారికి భక్తులు సమర్పించిన సుమారు 2 లక్షల పైగా వ్యయంతో గాజులు అలంకరణ చేశారు. పంచా రామంలోని శ్రీ పార్వతి, శ్రీ అన్నపూర్ణ అమ్మవార్లు, జేపీ రోడ్డులోని శ్రీ దత్త మందిరం లోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయం,గునుపూడి శ్రీ ఆదిలక్ష్మి పోలేరమ్మ ఆలయం, దిరుసుమర్రు రోడ్డులోని శ్రీ దుర్గలక్ష్మి ఆలయంతో పాటు అన్ని దేవి, విష్ణు ఆలయాలు భక్తులతో మహిళలతో కిటకిటలాడాయి. అన్ని దేవాలయాలలో ప్రత్యేక కుంకుమ పూజలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులకు ప్రసాద వితరణలు చేస్తున్నారు. దానితో నిన్నటి నుండి భీమవరం మార్కెట్ లో పండ్లు పువ్వుల ధరలు అమాంతంగా భారీగా పెరిగాయి.,డజను అరటిపళ్ళు 100 పైగా కొబ్బరి కాయ ఒక్కటి 50 రూపాయలు చప్పున అమ్ముతున్నారు.
