సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( EDఈడీ) షాక్ ఇచ్చింది. అవినాశ్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై అతని సన్నిహితుల ఇళ్ల ఫై దాడులకు దిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు,శుక్రవారం తెల్లవారుజాము నుంచి సోదాలు మొదలుపెట్టింది. ఈ మేరకు 10 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు ? జరుపుతున్నారు. హైదరాబాద్, పులివెందులలోని అవినాశ్ రెడ్డి నివాసాలు సహా ఆయన కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. .అవినాశ్ రెడ్డి ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. పులివెందులలోని దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. తొండూరు మండలం టి.తుమ్మలపల్లిలో ఎర్ర గంగిరెడ్డి నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. అలాగే, పులివెందులలోని జగన్ సమీప బంధు సునీల్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు.
