సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇకపై ఈడా ఏలూరు నుండి వేరుపడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (BHIMA UDA) ను ఏర్పాటు చేస్తూ ఈ అథారిటీ పరిధిలో 6 మున్సిపాలిటీలు,19 మండలాలు, 282 గ్రామాలును చేరుస్తు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి సర్కార్ అధికారిక ఉత్తర్వులు జారీ చెయ్యడం పట్ల జిల్లా ప్రజలలో హర్షం వ్యక్తం అవుతున్నా వేళా.. మరి ఇంతటి ప్రతిష్టాకర సంస్థకు చైర్మెన్ గా ఎవరిని ఎంపిక చేస్తారు? అన్న ఆత్రుత వ్యక్తం అవుతున్న వేళా .. జిల్లాలో ముగ్గురు జనసేన ఎమ్మెల్యేలు ఎలానూ బలపరుస్తారు కాబ్బటి పార్టీ ఆవిర్భావం నుండి దశాబ్దం పైగా ఉమ్మడి జిల్లా జనసేన అడ్జక్షుడు గా కొనసాగుతు, కష్టనష్టాలలో పార్టీని నడిపించిన సమర్ధుడు భీమవరం మాజీ మునిసిపల్ చైర్మన్ కోటికల పూడి గోవిందరావు( చినబాబు )పేరు వినపడింది. కూటమి అధికారంలోకి వచ్చాక కూడా కారణాలు ఏవైనా, 2న్నర ఏళ్లుగా ఏ అధికార పదవి ‘ చినబాబు‘ చేపట్టకపోవడం గమనార్హం. అయితే తాజా సమాచారం ప్రకారం .. పాలకోడేరు సహకార బ్యాంకు చైర్మెన్ ‘టీడీపీ నేత’ కొత్తపల్లి నాగరాజు పేరు కూడా తెరపైకి వచ్చింది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు సన్నిహిత వ్యక్తిగా, ‘కార్యసాధకుడు’ గా జిల్లాలో కూటమి నేతలు, ప్రజలకు అందరికి సుపరిచితుడు.. ప్రస్తుతం జిల్లాలోని ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలు తో పాటు జనసేన,బీజేపీ వారు కూడా తనను బలపరుస్తారని? ఆశాభావంతో ఈ విషయం మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకొనివెళ్ళారని, ఆయన పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఒకనాడు భీమవరం కేంద్రంగా టీడీపీ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయి నుండి.. కూటమి పొత్తుల కారణంగా నేడు, భీమవరంలో కనీసం ఒక్క ఎమ్మెల్సీ పదవి లేకుండా స్థానిక టీడీపీ నేతలు త్యాగం చెయ్యవలసి వచ్చింది. భీమవరం టీడీపీలో మరల జోష్ నింపాలంటే అత్యంత కీలకమైన BHIMA UDAచైర్మన్ పదవి ఇవ్వాలని అవిభక్త కవలలు అయిన ‘భీమవరం ఉండి’ టీడీపీ నేతలలో డిమాండ్ పెరుగుతుంది. రానున్న మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీలు తమ ప్యూహాలకు ఎంత పదును పెడతాయో? ఈ చైర్మెన్ పదవి ఎవరికీ అప్పగిస్తాయో? కొద్దీ రోజులలోనే అధికారిక ఉత్తర్వు కోసం ఎదురు చూడాలి.. భీమవరంలో BHIMA UDA కార్యాలయానికి ప్రభుత్వ నిర్వహణ ఖర్చులకు ఏటా రూ.1.10 కోట్లు అవసరం అవుతాయి అని అంచనా.
