సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతిని పురస్కరించు కొని భీమవరం తెలుగుదేశం పర్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్,టిడిపి రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి టీడీపీ నాయకులతో కలిసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మీ, టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ,, 1891లో జన్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా, సంఘ సంస్కర్తగా ప్రపంచవ్యాప్తంగా ఘన కీర్తిని సంపాదించారన్నారు. భారతదేశ నిర్మాణంలో అంబేద్కర్ కృషి స్ఫూర్తిదాయకమని న్యాయబద్ధమైన ప్రగతిశీల సమాజాన్ని నిర్మించేందుకు బాబాసాహెబ్ చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద, గునుపూడి అంబేద్కర్ నగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద చినపేట లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘన నివాళి అర్పించారు.ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు పట్టణానికి చెందిన టీడీపీ నేతలు కార్యకర్తలు విశేషంగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *