సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పద్మభూషణ్, స్వర్గీయ బివి రాజు గారి ఉన్నత ఆశయాలతో ప్రస్తుతం ఆయన మనుమడు విష్ణు రాజు సారధ్యంలో గత 25 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాలలో నెంబర్ 1 మహిళా విద్య సంస్థగా అత్యున్నత ఆధునిక ప్రమాణాలు వసతులతో ఉన్నత విద్యను అందిస్తూ వేలాది మంది విద్యార్థులను అత్యున్నత స్థాయికి చేర్చిన శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ మరో చారిత్రక మైలురాయిని అందుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి స్టేట్ ప్రైవేట్ మహిళా యూనివర్సిటీగా (‘విష్ణు విమెన్స్ యూనివర్సిటీ’) రూపాంతరం చెందింది. ఈ చారిత్రక ఘట్టాన్ని మరియు సంస్థ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని గత ఆదివారం రాత్రి పుర ప్రముఖులు సమక్షంలో ‘విష్ణు కాన్‌ఫ్లుయెన్స్ – మీట్ అండ్ గ్రీట్ రిసెప్షన్’ వేడుక అత్యద్భుత విద్యార్థుల సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో, బాణాసంచా కాల్పులు, గిరిజన సాంప్రదాయ డప్పులు కళాకారుల సందడితో ఆహుతులను ఆకట్టుకొంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ , రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేనురాజు, ఎంపీ పాక సత్యనారాయణ, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
