సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు, గురువారం సచివాలయంలో జరుగుతుంది, ఈసమావేశానికి ముందు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మంత్రులతో బ్రేక్ ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. అందులో వారికీ త్వరలో రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికలల్లో మెజారిటీ స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకోవాలన్నారు. ఈ ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతాయని అనుమానమే లేదని స్పష్టం చేశారు. ఈలోగా ప్రజలకు గత ప్రభుత్వము చేసిన విధ్వంసం,దానిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిందని వివరంగా చెప్పాలని మన సూపర్ సిక్స్ పధకాలు అమలు గురించి ప్రజలు అందరికీ తెలియాలని చెప్పారు. ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఇంటి వద్దా కనీసం 3 నిమిషాలైనా ఉండి వివరించాలంటూ మంత్రులకు దిశానిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *