సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు, సచివాలయంలో జరుగుతుంది, ఈ సమావేశంలో 30కి పైగా కీలక అజెండా అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. వీటిలో ముఖ్యంగా ‘అమరావతి ఐ’ ప్రాజెక్టుకు రీ-టెండర్లు పిలవడంతో పాటు, ఈ ప్రాజెక్టు కోసం గరిష్ఠంగా 10 ఎకరాల అదనపు భూమిని లీజుకు ఇవ్వాలనే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణ పనులను ఎల్ అండ్ టీ (L&T)కు అప్పగించడంపై చర్చ జరుగుతుంది.రూ.1,002.49 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రుణ సమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది. నగర మరియు మునిసిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భీమవరం, మార్కాపురం, నంద్యాలలో కొత్త అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల(UDA) ఏర్పాటుతో పాటు పలు యూడీఏల పరిధుల మార్పులు, పరిసర గ్రామాల విలీనాలపై, అడ్డంకి గా ఉన్న కోర్ట్ కేసులపై చర్చించనున్నారు,. అమరావతిలో మరోసారి నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్ల కోసం అదనపు కన్సల్టెన్సీ వ్యయంపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని రూ.206.60 కోట్లకు పెంచే ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలించనుంది. అమరావతిలో భూ కేటాయింపులపై జీఓఎమ్(GoM) చేసిన సిఫార్సులకు ,ల్యాండ్ పూలింగ్ రైతులకు చెల్లించాల్సిన యాన్యుటీ కోసం రూ.300 కోట్ల రుణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
