సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జేష్టమాస జాతర మహోత్సవాలు ప్రారంభ సంకేతంగా గత బుధవారం రాత్రి 7 గంటల సమయంలో మేళతాళాలతో ఘట్టాలతో ..శ్రీ అమ్మవారిని నిలుపుదల కార్యక్రమం ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అర్చకులు.. వేదపండితులు శ్రీ అమ్మవారి ఘటాలకు. విశేష పూజలు నిర్వహించిన అనంతరం సంప్రదాయం అనుసరించి శ్రీ అమ్మవారి పుట్టింటి మెట్టింటి వారు అల్లూరి, మెంటే వంశ్దస్తులచే మేళ.. తాళాలు.. డప్పు వాయిధ్యాలు మార్మోగుతుండగా, వైభవం గా ప్రధమ పూజలు ప్రారంభించారు. ఈ జేష్ఠమాస జాతర నేపథ్యంలో ఈ మాసంలో శ్రీ అమ్మవారు ఘటాల రూపంలో ప్రతి ఇంటికి వెళ్లి పసుపు నీళ్లతో వారి ఆహ్వానం అందుకొని మహిళలకు పసుపు కుంకుమలు అందజేస్తారు. జులై 2వ తేదీ గురువారం మధ్యాహ్నం నుండి శ్రీ అమ్మవారి నగర ఊరేగింపు తో రాత్రివరకు వందలాది కళాకారులతో జేష్ఠమాస జాతర ఘనంగా నిర్వహించనున్నారు.
