సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం పాతూరు దిరురుమర్రు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు,శుక్రవారం జిల్లాస్థాయి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ తల్లిదండ్రులు తాహతకు మించి అప్పులు చేసి, భారీ పీజులు చెల్లించి ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు.ప్రస్తుతం అన్ని ఆధునిక సౌకర్యాలు మంచి టీచర్లు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి ఎంతోమంది నేడు ఉన్నతస్థాయిలో స్థిరపడ్డారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉంటారని, ఏ విద్యార్థికి ఎలా బోధించాలో బాగా తెలుసునన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు శ్రద్ధగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు వారి తల్లిదండ్రులు, గ్రామస్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *