సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: .భీమవరం నియోజకవర్గం టిడిపి కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల నుండి వినతి పత్రాలు తీసుకున్న నియోజవర్గ టిడిపి ఇన్చార్జ్,మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ..ఎంతమంది పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకాన్ని వర్తింప చేస్తున్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలోని విద్యార్థిని విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం ద్వారా వారి ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగిందని నగదు జమ కానీ వారు సంబంధిత సచివాలయాల్లో ఫిర్యాదు చేయాలని కోరారు. టిడిపి రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ప్రజా సమస్యల వేదిక ద్వారా నియోజకవర్గ ప్రజల నుండి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు విశేషంగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *