సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క కూటమి అభ్యర్థుల నామినేషన్స్ వేస్తున్న పర్వము పెద్ద ఎత్తున కొనసాగుతుంటే.. మరో ప్రక్క స్థానిక బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ భీమవరం కూటమి నాయకుల వైఖరి పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆకస్మికంగా నేడు, సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. తనను సంప్రదించకుండా టీడీపీ , జనసేన నేతలు గత రాత్రి సొంతంగా వాళ్ళు కౌన్సిలర్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించడం బీజేపీని అవమానించటమే అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ దేశంలోనే అత్యధిక కోట్లాది మంది క్యాడర్ తో అగ్రస్థానంలో ఉన్న బీజేపీ బీజేపీ కి ఇక్కడ భీమవరం లో నేతలు గౌరవం ఇవ్వకపోతే సహించలేము. ఇక్కడ మొత్తము 52 వార్డుల్లో బీజేపీ కి కేటాయింపు లో అన్యాయం జరిగింది ముందుగా కనీసం 5 వార్డులు బీజేపీ కి ఇస్తామని చెప్పి, ఆ వార్డులు ఏవో కూడా వారే నిర్ణయించేయడం కరెక్ట్ కాదు నా ఇంటి పక్కన 5 వార్డులు నాకెందుకు? బీజేపీ క్యాడర్ ఎక్కడున్నారో అక్కడ సీట్లివ్వాలి. ఆఖరికి 1981 నుండి జరిగిన ప్రతి ఎన్నికల్లో బిజెపికి మున్సిపాలిటీలో ప్రాతినిధ్యం ఉంది.అప్పటి బీజేపీ కౌన్సిలర్ ఇప్పటి , రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ తనయుడుకి కూడా వారు సీటివ్వలేదు అంటే అవమానం ఎలా సహిస్తాం? భీమవరంలో బీజేపీ కి శక్తి ఉంది, మేమూ అన్ని స్థానాల్లో సొంతంగా పోటీ చేస్తాం.పొత్తులో ఇచ్చే ఇచ్చే స్థానాలు కంటే ఎక్కువే గెలిచి సత్తా మాకు ఉంది. దీనిపై కేంద్ర బీజేపీ అధిష్టానం కు పిర్యదు చేశాను అన్నారు వర్మ.. తదుపరి మీడియా సమావేశం క్యాన్సిల్ చేసితాజా పరిణామాలు ఫై చర్చించేందుకు వర్మ విజయవాడ బయలు దేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *